
హైదరాబాద్ : బేగంబజార్ లో టీఆర్ఎస్ అభ్యర్థి పూజా వ్యాస్ బిలాల్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే ర్యాలీలో డీజేకు అనుమతి లేదంటూ కేసు నమోదు చేశారు షాహీనాయత్ గంజ్ పోలీసులు. ఎన్నికల కోడ్ ను పక్కగా అమలు చేస్తున్నామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 ,777 పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించామని చెప్పారు. గ్రేటర్ లో అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపుకు 20 పత్యేక బృందాలు మూడు షిఫ్టులుగా పని చేస్తున్నాయని తెలిపారు.