కొందరు సంచలనాల కోసం ఆరోపణలు చేస్తున్నారు

హైద‌రాబాద్: చేపలు, కోళ్లు, మటన్, కోడి గుడ్లు ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్నామ‌న్నారు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్. మటన్ 700 రూపాయలకే కేజీ అమ్మాలని అదేశించామ‌న్నారు. శుక్ర‌వారం నుంచి రాష్ట్రంలో రెండో విడత రేషన్ పంపిణీ ప్రారంభించామ‌ని.. వలస కార్మికుల తరలింపునకు రైళ్లు పెట్టాలన్నారు. వలస కార్మికులను తమ స్వంత రాష్ట్రాలకు తరలించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వం తరలించిన వలస కార్మికులకు భోజనం పెట్టి పంపించామని, ఉదయం ఒక రైలు జార్ఖండ్ బయలుదేరిందన్నారు.

బీజేపీకి కొత్తగా అధ్యక్షుడైన‌ బండి సంజయ్.. ఏవేవో మాట్లాడుతున్నారని బాధ్యత కలిగిన‌ ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడు కరోనా కష్ట కాలంలో విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత తో మాట్లాడాలని.. కొందరు సంచలనాల కోసం ఆరోపణలు చేస్తున్నారన్నారు. నరం లేని నాలుక ఉందని, పనికి మాలిన చెత్త నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ని ఏ రాష్ట్రంలో ప్రజలు పట్టించుకోవడం లేదని, అఖిలపక్షం అంటే అలీ బాబా బ్యాచ్.. ఎన్నికల ముందు చూశాం అన్నారు మంత్రి త‌ల‌సాని.

Latest Updates