వ‌ర‌ద బాధితుల‌కు న‌గ‌దు సాయం చేసింది ఒక్క కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే

హైదరాబాద్: వరద ముంపుకు గురైన వారికి నగదు ఇవ్వడం అనేది చరిత్రలో ఎక్కడా లేదని, అది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మాత్రమే అమ‌లు చేస్తున్నార‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం భారీ వర్షాలకు ముంపుకు గురైన మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని నాలా బజార్, రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని నల్లగుట్ట, సి లైన్, ఎఫ్ లైన్, బేగంపేట డివిజన్ పరిధిలోని బ్రాహ్మణ వాడి తదితర ప్రాంతాలలో మంత్రి ప‌ర్య‌టించారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి గత పాలకుల పరిపాలనకుకు నిదర్శనమ‌ని అన్నారు. త‌మ‌ ప్రభుత్వం వచ్చిన తరువాత  నాళాల దగ్గర..ఎఫ్ టి ఎల్ ప్రాంతాలల్లో..షికం భూములల్లో ఒక్కటి కూడా పర్మిషన్స్ ఇవ్వలేదని అన్నారు..ఈ విషయం లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిస్తుందని,ఇప్పటి వరకు వరద సహాయం అందించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తిలి అరుణ, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates