సమస్యలు ఉంటే ఫిర్యాదు బాక్స్ లో వేయండి: తలసాని

సికింద్రాబాద్: ప్రజల సమస్యను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రజా ఫిర్యాదుల బాక్స్ ను ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శనివారం పద్మారావు నగర్ పార్కువద్ద టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఈ బాక్స్ ను, ఎస్సీ కళాశాల విద్యార్థుల కోసం ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఫిర్యాదు బాక్స్ లో వినతి పత్రాలను వేస్తే పరిష్కరిస్తానని అన్నారు తలసాని. సర్దార్ పటేల్ కళాశాల విద్యార్థుల కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఐదు రూపాయల భోజనంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకేమైనా సమస్యలు  ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

Latest Updates