కులవృత్తులకు చేయూతనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం

యాదాద్రి భువనగిరి జిల్లా : కరోనా కాలంలో కూడా కోటి రెండు లక్షల ఎకరాల పంటను రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమ‌ని అన్నారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భువనగిరి పట్టణంలోని తీనాం చెరువులో మంగ‌ళ‌వారం మంత్రి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కులవృత్తులకు చేయూత నివ్వడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా.. నిధులు కేటాయించి, అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అ‌న్నారు.

గొల్ల, కురుమ‌ల‌కు, మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా త్వరలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ను ప్రారంభిస్తామ‌ని ఆయ‌న అన్నారు. రెండో దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామ‌న్నారు. త్వరలో ఎనిమల్ హెల్త్ కార్డు విధానం కూడా ప్రవేశపెడతామ‌న్నారు.

Minister Talasani Srinivas Yadav

Latest Updates