గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు

తాను గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు ఏమైనా తప్పుగా ఉన్నాయని భావిస్తే వారికి క్షమాపణలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఐదు రోజుల క్రితం కోకాపేట లో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి గంగపుత్రుల సంక్షేమం, అభివృద్ధి పట్టించుకున్న వారు లేర‌న్నారు. గతంలో మత్స్యకార సొసైటీలలో వివిధ వర్గాల వారు సభ్యులుగా ఉన్నారన్నారు. మత్స్యకార వృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న గంగపుత్రులు, ముదిరాజ్ లు, బెస్త తదితర వారికి మేలు చేయాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశ్యమ‌ని చెప్పారు.

Related news:

మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి.. తలసాని క్షమాపణ చెప్పాలి

Latest Updates