బ్యాలెట్ ద్వారా ఎన్నికలంటే ప్రతిపక్షాలు వద్దంటున్నాయి

హైదరాబాద్: తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే రానున్న ఎన్నికల్లో గెలిపిస్తాయన్నారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు దేశంలో ఎక్కడా లేని విధంగా నీచ రాజకీయాల చేస్తున్నాయన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోశామహల్ నియోజకవర్గం పరిధిలో ఇల్లు కూలిపోయిన 10 బాధిత కుటుంబాలకు మంగళవారం శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. ఒక్కొక్కరికి 25 వేల చెక్కులను మంత్రి అందజేశారు.

ఎల్.ఆర్.ఎస్ , బి.ఆర్.ఎస్ , జీవో 58 ద్వారా ప్రజల ఆస్థులను క్రమబద్దీకరించి కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే… ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు పెడితే ట్యాంపరింగ్ జరుగుతున్నాయని , బ్యాలెట్ ద్వారా ఎన్నికలు అంటే వద్దు ఈవీఎంలు పెట్టాలంటూ ప్రతిపక్షాలు అంటున్నాయన్నారు. వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని.. GHMC ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని తెలిపారు మంత్రి తలసాని.

Latest Updates