స్వచ్ హైదరాబాద్ గా తీర్చి దిద్దాలె

స్వచ్ హైదరాబాద్ గా తీర్చి దిద్దాలె

హైదరాబాద్ : ప్రతి ఏటా స్వచ్ సర్వేక్షన్ ర్యాంకింగ్ లో హైదరాబాద్ ముందు నిలుస్తోందన్నారు మంత్రి కేటీఆర్. గతంలో 3 వేల 5 వందల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదని... ఇపుడు 6 వేల 5 వందల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోందన్నారు. బల్దియాలో పనిచేస్తున్న అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి, స్వచ్ హైదరాబాద్ గా తీర్చి దిద్దాలన్నారు. సనత్ నగర్ స్పోర్ట్ స్టేడియంలో 13 వందల 50 స్వచ్ఛ్ ఆటోలు ప్రారంభించారు మంత్రి కేటీఆర్. కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద 20 మెగా వాట్స్ ప్లాంట్లను జవహర్ నగర్ లో ప్రారంభించుకున్నామని.. రాబోయే రోజుల్లో మరో 28 మెగావాట్ల ప్లాంట్ ను ప్రారంభించబోతున్నామని చెప్పారు కేటీఆర్.