సీఎం నియోజకవర్గంలో నేతల పర్యటన

గజ్వేల్ రూరల్, వెలుగు: రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, చైర్​పర్సన్ల  బృందం మంగళవారం గజ్వేల్ మున్సిపాలిటీ లో పర్యటించింది. గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామం, అర్బన్ పార్క్ లను సందర్శించారు. సాయంత్రం 4:54 నిమిషాలకి గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేరుకున్నారు. సుమారు మూడు గంటలు గజ్వేల్ లో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మార్కెట్ లో కూరగాయలు, పండ్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ క్రయ విక్రయాలను పరిశీలించారు. గజ్వేల్ అర్బన్ పార్క్ లో  ఔషధ మొక్కలను చూశారు. అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, లక్ష్మా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్,  ఈటెల రాజేందర్, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రామలింగారెడ్డి, పద్మా దేవేందర్​రెడ్డి, సతీష్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, ఐఏఎస్ అధికారులు వెంకట్రామ రెడ్డి, హనుమంతరావు, శరత్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

సీఎం మీటింగ్ను బహిష్కరించిన కాంగ్రెస్ ఎమ్యెల్యేలు

హైదరాబాద్‌, వెలుగు : మున్సిపల్‌కమిషనర్లు, చైర్మన్లు, మేయర్లతో ప్రగతిభవన్‌లో  సీఎం  కేసీఆర్‌మంగళవారం ఏర్పాటు చేసిన మీటింగ్‌ను కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బహిష్కరించారు. మున్సిపల్‌ఎన్నికలు అక్రమంగా జరిగాయని, డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగం, ఎన్నికల కమిషన్ పక్షపాతంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్యెల్యేలు సమావేశాన్ని బహిష్కరించినట్లు గాంధీభవన్‌వర్గాలు వెల్లడించారు.

భర్తృహరి, ఏనుగు లక్ష్మణ కవి పద్యాలు

సమావేశంలో భర్తృహరి, లక్ష్మణస్వామి పద్యాలను చదివి సీఎం ఉత్సాహపరిచారు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్‌పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఎంతముందుకైనా పోవచ్చన్నారు. మేయర్లు, చైర్‌పర్సన్లంతా ధీరులు కావాలని, గట్టి సంకల్పం ఉంటే వందశాతం విజయం సాధిస్తారని చెప్పారు.

ఇండ్ల రెగ్యులరైజేషన్‌‌కు మరో చాన్స్?

మున్సిపల్‌‌యాక్ట్‌‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కేసీఆర్ సూచించారు. ఇండ్ల నిర్మాణం, లే అవుట్ల పర్మిట్లలో సులభమైన విధానం తెచ్చామని తెలిపారు. తాము కల్పించిన అవకాశాన్ని ఎవరైనా దుర్వినియోగం చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామనే విషయం ప్రజలకు చెప్పాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి జీవో నం.58, 59 ద్వారా రెగ్యులరైజ్‌‌చేశామని, ఇంకా అలాంటి ఇండ్లేమైనా ఉంటే రెగ్యులరైజేషన్‌‌కు మరో చాన్స్‌‌ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ఇందులో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలన్నారు.

Latest Updates