‘వెలుగు’ ఎఫెక్ట్: దారికొచ్చిన మంత్రులు

మంత్రులు చలాన్లు కడ్తుండ్రు

హైదరాబాద్‌‌, వెలుగు: ఓవర్‌‌ స్పీడ్‌‌తో ట్రాఫిక్‌‌ రూల్స్‌‌ను బ్రేక్‌‌ చేసిన మంత్రులు తమ బండ్లపై ఉన్న పెండింగ్‌‌ చలాన్లు క్లియర్‌‌ చేస్తున్నరు. ‘మంత్రుల బండ్లు మహాస్పీడ్‌‌’ శీర్షికన శుక్రవారం ‘వెలుగు’లో స్టోరీ పబ్లిష్‌‌ కావడంతో ఏ మంత్రి కారుపై ఎన్ని చలాన్లు పెండింగ్‌‌లో ఉన్నాయన్న ముచ్చట అందరికీ తెలిసింది. ఒక్కో మినిస్టర్‌‌ కారుపై మూడు నుంచి తొమ్మిది వరకు చలాన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. శనివారం కొందరు మంత్రులు తమ పెండింగ్‌‌ చలాన్లను ఆన్‌‌లైన్‌‌లో కట్టేశారు. ఇ-చలాన్ వెబ్‌‌సైట్‌‌లో ఆయా మంత్రులు తమ కార్లపై ఉన్న చలాన్లను పే చేసినట్టుగా అప్డేట్‌‌ అయి కనిపించింది.

Latest Updates