దర్యాప్తు చేయకుండా నిందలా? పాక్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మరోసారి బయటపెట్టింది. పుల్వామా దాడిపై ఆ దేశ స్పందన పుండు మీద కారం చల్లిన రీతిలో ఉంది. పాక్ బేస్ గా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తామే పుల్వామా దాడి చేశామని ప్రకటించుకుంది. పాక్ గడ్డపై నుంచి ఆపరేట్ చేసి 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్ర మూకల చర్యలు తీసుకోవడం మానేసి భారత్  పైనే విమర్శలకు దిగింది దాయాది దేశం. దర్యాప్తు చేయకుండా తమ దేశంపై ఆరోపణలు చేయడం తగదంటూ పాక్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.

అంతటితో ఆగకుండా భారత ఆక్రమిత కశ్మీర్ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ భారత ప్రభుత్వం హింస సృష్టిస్తోందని దాన్ని తాము సహించమని చెప్పింది. పుల్వామాలో జరిగిన దాడిని సీరియస్ గా పరిగణిస్తున్నామని తెలిపింది. ఆ దాడి విషయంలో మీడియా పాక్ ను వేలెత్తి చూపడాన్ని కూడా ఖండించింది. కశ్మీర్ లోయలో జరిగే హింసను తాము ఎప్పుడూ ఖండిస్తూనే ఉన్నామని పేర్కొంది.

Latest Updates