బోయిన్‌పల్లి యాక్సిడెంట్.. మైనర్ బాలుడు, తండ్రి అరెస్ట్

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి నిర్లక్ష్యంగా కారును నడిపిన మైనర్ బాలుడితోపాటు.. అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రోజున డైరీ ఫామ్ దగ్గర… మైనర్ బాలుడు.. నిర్లక్ష్యంగా, అతివేగంతో కారు నడుపుతూ.. ఆటోను, 2 టూ వీలర్లను ఢీకొట్టాడు. మహిళ నాగమణి, 14 నెలల బాలుడు మాధవ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ మైనర్ బాలుడు, మరో ఇద్దరు పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలించారు.

రోడ్డు ప్రమాదానికి, ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన మైనర్ బాలుడు హసన్ తో పాటు తండ్రి నూరుద్దీన్ ను అరెస్ట్ చేశారు. బోయిన్ పల్లి పోలీసులు. అల్వాల్ ఆర్టీసీ కాలనీలోని బంధువుల ఇంట్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గాంధీ హాస్పిటల్ లో వారికి మెడికల్ టెస్టులు చేయించి స్టేషన్ కు తీసుకెళ్లారు. తండ్రి నూరుద్దీన్ ను సికింద్రాబాద్ కోర్టు, మైనర్ బాలుడు హసన్ ను జువైనల్ కోర్టుకు తీసుకెళ్లారు బోయిన్ పల్లి పోలీసులు.

Latest Updates