క్రైమ్ పెట్రోల్‌ వీడియోలు 100సార్లు చూసి తండ్రిని చంపిన మైనర్ బాలుడు

ఉత్తర ప్రదేశ్‌లో ఊహకందని రీతిలో ఓ వ్యక్తి హత్య జరిగింది. తండ్రిని హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేశాడో మైనర్ బాలుడు. మథురలో మే నెలలో జరిగిన ఈ ఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. మథురకు చెందిన ఓ వ్యక్తికి ఒక కూతురు, ఒక కొడుకు. అయితే ఈ తండ్రి తరచూ కూతురిని కొట్టేవాడు. దాంతో తన సోదరిపై తండ్రి దాడిచేయడాన్ని 11వ తరగతి చదువున్న బాలుడు సహించలేకపోయాడు. విసిగిపోయిన బాలుడు.. తన తండ్రిని అంతమొందించాలనుకున్నాడు. అందుకోసం తన మొబైల్‌లో క్రైమ్ పెట్రోల్‌ వీడియోలను 100 సార్లు చూశాడు. వాటిని చూసిన తర్వాత హత్య చేసి ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా.. తండ్రిని మొదట బాలుడు రాడ్‌తో తలపై కొట్టాడు. వెంటనే కిందపడ్డ తండ్రి ముఖాన్ని క్లాత్‌తో కప్పి.. కత్తితో గొత్తు కోసి చంపాడు. ఆ తర్వాత ముఖం, మెడపై తన వేలిముద్రలు లేకుండా చేసి.. తండ్రి మృతదేహాన్ని ఎవరికీ దొరకుకుండా మాయం చేశాడు.

భర్త కనిపించకపోవడంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు బాలుడిని విచారించగా అసలు విషయం బయటపడింది. ‘బాలుడు తన తండ్రిని చంపడం కోసం మొబైల్‌లో క్రైమ్ పెట్రోల్‌ మరియు క్రైమ్ సంబంధిత వీడియోలను కనీసం 100 సార్లు చూశాడు. ఆ తర్వాత ప్రణాళికాబద్ధంగా తండ్రిని గొంతు కోసి చంపాడు. బాలుడు యూట్యూబ్‌లో క్రైమ్ పెట్రోల్ వీడియోలను చూడటం అలవాటు చేసుకున్నాడు. వాటి నుంచి ఈ నేరం ఎలా చేయాలో తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఎటువంటి ఆధారాలు లభించకుండా మాయం చేశాడు. బాలుడు తన ఫోన్‌లో క్రైమ్ పెట్రోల్ వీడియోలు చూసినట్లు ఆధారాలు లభించాయి’ అని మథుర సిటీ ఎస్పీ ఉదయ్ మిశ్రా తెలిపారు.

For More News..

నాకు తోడుగా రఘునందన్‌ను అసెంబ్లీకి పంపిస్తే అయ్యాకొడుకులను ఓ ఆట ఆడుకుంటాం

నేటి నుంచి భారత్‌లో పబ్జీ బంద్

ముగ్గురు బీజేపీ కార్యకర్తలను చంపిన ఉగ్రవాదులు .. సంతాపం తెలిపిన ప్రధాని మోడీ

14 ఏళ్లకే గర్భం.. సీక్రెట్‌గా డెలివరీ.. పేరెంట్స్‌కు భయపడి శిశువును ఫ్రీజర్‌లో దాచిన బాలిక

Latest Updates