ఐపీఎల్–13 షెడ్యూల్లో స్వల్పమార్పులు

న్యూఢిల్లీ: ఐపీఎల్–13 షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకోనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు టోర్నీజరుగుతుందని లీగ్ చైర్మన్ బ్రిజేష్ ప‌టేల్ ప్ర‌కటించినా.. ఫైనల్ మ్యాచ్ రెండు రోజులు ఆలస్యంగా జరిగే అవకా శాలున్నాయి. అంటే నవంబర్ 8న జరగాల్సిన ఫైనల్‌ను10న నిర్వహిస్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా.. గవర్నింగ్ కౌన్సిల్ మీట్ంగ్‌లో పూర్తి స్పష్టత రావొచ్చు. అయితే ఫైనల్ ను వాయిదా వేయడానికి ఆసీస్ టూరే కారణంగా తెలుస్తోంది.

ఐపీఎల్ తర్వాత టీమిండియా.. ఆసీస్ టూర్ కు వెళ్లాల్సి ఉంది. అక్కడికి వెళ్లిన‌ తర్వాత రెండు వారాలు క్వారంటైన్ లో ఉండాలి. అయితే ఫైనల్ రెండు రోజులు ఆలస్యంగా నిర్వహించడం వల్ల టీమిండియా ప్లేయర్ల‌ను మళ్లీ ఇండియాకు తీసుకురాకుండా సురక్షితంగా ఆసీస్ కు పంపించాలన్నది బీసీసీఐ ఆలోచన. ఫైనల్ కు చాన్స్ లేని మిగతా ప్లేయరను కూడా అక్కడే ఉంచాలని బోర్డు భావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Latest Updates