చెవి కమ్మలు కొనివ్వలేదని టెన్త్ విద్యార్థిని సూసైడ్

కామారెడ్డి జిల్లా : తల్లిదండ్రులు బంగారు చెవి కమ్మలు కొనివ్వలేదని టెన్త్ చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన బీరయ్య, బీరవ్వ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. భార్య భర్తలిద్దరూ వ్యవసాయం చేసుకుంటున్నారు. చిన్న కుమార్తె పూజిత చాలా రోజులుగా తనకు బంగారు కమ్మలు కొనివ్వాలని తల్లిదండ్రులు అడుగుతోంది. డబ్బులు లేకపోవడంతో… తర్వాత కొనిస్తామని వాళ్ళు పూజితకు నచ్చచెబుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పూజిత ఉరివేసుకొని చనిపోయింది. పూజిత చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates