పంజాగుట్టలో దారుణం.. 13 ఏళ్ల మైనర్ బాలికపై రేప్

పంజాగుట్టలో దారుణం జరిగింది. మైనర్ బాలిక (13ఏళ్లు)పై జహంగీర్ అనే కామంధుడు అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పంజాగుట్టలో కూలీ పనులు చేసుకుంటున్నారు. ఆ బాలిక ఇంటి పక్కనే ఉంటున్న జహంగీర్ ఎంఎస్ మక్తాలో పంక్చర్ షాపు నడుపుతున్నాడు. అయితే బాలిక తల్లిదండ్రులు ఎవరు లేని సమయంలో మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. గత కొన్ని రోజులుగా బాలికను అత్యాచారం చేస్తున్నాడు. అయితే మంగళవారం నిరసంగా ఉన్న బాలికను తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు జహంగీర్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

see more news

తిరుమలలో ఒంటికి నిప్పంటించుకున్న భక్తుడు

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి పరారైన JNU స్టూడెంట్ అరెస్ట్

Latest Updates