తల్లిదండ్రుల్ని, తమ్మున్ని చంపిన మైనర్ బాలుడు

సొంత తల్లిదండ్రుల్ని, తమ్మున్ని ఓ మైనర్ బాలుడు చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. బాలుడు చిన్నతనంలోనే మద్యానికి బానిస కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ అధికారి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. రెండు రోజులుగా ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోవడం మరియు ఇంట్లోంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అక్కడకు వచ్చి చూసిన పోలీసులు మూడు మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటన జనవరి 28న వెలుగులోకి వచ్చింది.

సాగర్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఒక బాలుడు అనుమానాస్పదంగా చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడే ఈ హత్యలు చేసినట్లుగా తేలిందని సాగర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ సంఘి తెలిపారు. చిన్నతనంలోనే మద్యానికి బానిసైన బాలుడు.. మొదట జనవరి 24న తన తల్లిని హత్య చేశాడని.. ఆ తర్వాత తండ్రిని, తమ్ముడిని కూడా హత్య చేశాడని ఆయన తెలిపారు. గతంలో ఈ బాలుడు ఇంటినుంచి రూ. 40 వేలు దోచుకొని పారిపోయాడని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ సంఘి తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

బర్త్‌డేకు పిలిచి.. గన్‌తో బెదిరించి..

పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత కాలేజీకి..

Latest Updates