గర్భం దాల్చిన బాలికకు పెళ్లి.. మైనర్ వివాహాన్ని అడుకున్న పోలీసులు

ద్వారకా తిరరుమల : వేర్వేరు సంఘటనల్లో రెండు మైనర్ వివాహాలు కలకలం రేపిన సంఘటన ఏపీలో జరిగాయి. వెస్ట్ గోదావరి జిల్లా, ద్వారకా తిరరుమల మండలం, పాములవారి గూడెంలో రెండు రోజుల్లో రెండు మైనర్ వివాహాలు జరుగుతుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఓ పెళ్లిని అడ్డుకున్నారు. విచారణ చేపట్టగా.. పాములవారిగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడు, మైనర్ బాలిక మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని తెలిపారు పోలీసులు. దీంతో బాలిక గర్భం దాల్చడంతో ఆదివారం రాత్రి వారిద్దరికీ గ్రామ పెద్దలు వివాహం చేశారు.

మరో మైనర్ బాలుడికి, మరో మైనర్ బాలికకు కూడా సోమవారం ఉదయం వివాహం చేసేందుకు స్థానిక పెద్దలు ప్రయత్నించారు. సమాచారం రావడంతో పెళ్ళిని పోలీసులు అడ్డుకున్నారు. రెండు సంఘటనల్లోనూ మైనర్ బాలురు ఇద్దరూ అన్నదమ్ములు కావడం గమనార్హం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైనర్లకు వివాహ వయసుపై అవగాహన కల్పించారు. ఇక అప్పటికే పెళ్లైన మరో జంట ..వివాహానికి ముందే తప్పటడుగులు వేయడంతో.. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పోలీసులు ఉన్నారని సమాచారం.

Latest Updates