చనిపోవాలని డిసైడ్​ అయ్యా.. సోషల్​ మీడియాలో నిరుద్యోగి సెల్ఫీ వీడియో

నోటిఫికేషన్లు రావడం లేదని సూసైడ్​ అటెంప్ట్​
చదివిందే చదివి ఒత్తిడికి గురవుతున్నం

సోషల్​ మీడియాలో సెల్ఫీ వీడియో ​వైరల్​

మిర్యాలగూడ, వెలుగు: ‘రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తలేదు. చదివిందే చదివి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నం.  ట్వంటీ డేస్​ స్ట్రగుల్​ తర్వాత చనిపోవాలని డిసైడ్​ అయ్యా. నాకు చచ్చిపోవాలని లేదు. అమ్మా.. పుత్రశోకం ఇస్తున్నందుకు క్షమించండి’ అంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం అశోక్​నగర్​కు చెందిన సంపత్​ అనే యువకుడు రెండు రోజుల క్రితం విషం తాగి సూసైడ్​ అటెంప్ట్​ చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది.  ఆత్మహత్యా యత్నానికి ముందు సంపత్​ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్​ మీడియాలో వైరలైంది. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుకు ఈ వీడియో నిదర్శనంగా మారింది. ఇందులో సంపత్​ నాలుగైదేళ్లకోసారి నోటిఫికేషన్​ ఇస్తున్నారు.. ఏదైనా సరే ఆరు నెలల్లో కంప్లీట్​ చేయాలని సూచించాడు. మొన్న వీఆర్వోలను రద్దు చేశారు.. వాళ్లను మళ్లీ సర్దుబాటు చేస్తామంటున్నారు. పాతవాళ్లనే సర్దుబాటు చేస్తుంటే నాలాంటి నిరుద్యోగుల పరిస్థితి ఏమవ్వాలని ప్రశ్నించాడు. ‘సీఎం సర్..​ నిరుద్యోగులకు నమ్మకం ఇవ్వండని’ కోరాడు. ప్రస్తుతం సంపత్​కు​ పట్టణంలోని ఓ ప్రైవేట్​ హాస్పిటల్​లో ట్రీట్మెంట్​ చేస్తున్నారు.

For More News..

కరోనా రికవరీల్లో అమెరికాను దాటేసిన ఇండియా

డాక్టర్లపై దాడిచేస్తే ఏడేళ్లు జైలు, 5 లక్షల ఫైన్

న్యూయార్క్‌‌‌‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

Latest Updates