సబ్ ఇన్​స్పెక్టర్ టు సబ్ రిజిస్ట్రార్

మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ అనూష….గవర్నమెంట్​ జాబ్​లను ఛేజ్​ చేయటంలో నెంబర్​ వన్​.  సాఫ్ట్ వేర్​ ఇంజినీర్​గా ప్రైవేటు కంపెనీలో తన కెరీర్​ను మొదలు పెట్టి  వరుస పెట్టినట్లుగా..  ఏడు గవర్నమెంట్​ జాబ్​లు సాధించారు. రెండ్రోజుల కిందట రిలీజైన  గ్రూప్​ 2 ఫలితాల్లో సబ్​ రిజిస్ట్రార్​ జాబ్​కు సెలెక్టయ్యారు.తన సక్సెస్​ జర్నీ ఆమె మాటల్లోనే..

బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్నప్పుడే క్యాంపస్ సెలక్షన్స్‌‌లో విప్రో కంపెనీలో జాబ్​కు సెలక్టయ్యాను. నెలకు రూ.30 వేల జీతం. అక్కడున్నప్పుడే 2015లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చింది. రోజూ జాబ్​కు వెళుతూనే ప్రిపేరైన.  స్టెనోగా ఫస్ట్ జాబ్ వచ్చింది. తర్వాత ఏడాది కానిస్టేబుల్​ నోటిఫికేషన్​ అటెండ్ చేసిన.  సివిల్, ఎక్సైజ్ కానిస్టేబుల్‌‌గా రెండింటికి సెలెక్టయిన. తర్వాత సివిల్ ఎస్సైగా ఫోర్త్ జాబ్. మిర్యాలగూడ రూరల్​ ఎస్సైగా ఇప్పుడు డ్యూటీ చేస్తున్న. ఈ డ్యూటీలో ఉంటూనే  గ్రూప్‌‌–2కు ప్రిపేరైన. గత ఏడాది  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌‌‌‌గా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌‌ నోటిఫికేషన్​ కూడా అటెంప్ట్ చేసిన. రెండు జాబ్​లు వచ్చాయి. కానీ వద్దనుకొని  వెళ్లలేదు. ఇప్పుడు గ్రూప్–2 రిజల్ట్స్​ వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్‌‌‌‌గా సెలెక్టయిన.

ఏకాగ్రతగా వినటమే నా సీక్రెట్​

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ అయినా, స్టేట్ కమిషన్ నోటిఫికేషన్స్ అయినా కేవలం అకాడమి బుక్స్ మాత్రమే ఫాలో అయిన. జనరల్ స్టడీస్ కోసం ఎక్కువగా న్యూస్‌‌పేపర్ చదివేదాన్ని.. చిన్నప్పటి నుంచి పేపర్ చదవడం అలవాటు. అది నాకు కాంపిటీటివ్‌‌ పరీక్షల్లో చాలా ఉపయోగపడింది. నాకు ఎక్కువగా చదవడం కన్నా ఏకాగ్రతగా వినటం ఇష్టం. నేను ప్రిపరేషన్ కూడా ఎక్కువగా డే టైంలోనే చేశా. ఎన్ని గంటలు చదివినా అన్నది ఎప్పుడూ చూసుకోను. ఎంత క్వాలిటీగా చదివాను అన్నదే గుర్తుచేసుకుంట.  అదే నాకు ఎగ్జామ్ హాల్‌‌లో ప్లస్ అయింది.  ఇది చదివానా, అది చదివానా అని ఎప్పుడూ  టెన్షన్​ పడేదాన్ని కాదు.  అన్నింటికంటే ముఖ్యంగా నా మీద నాకున్న కాన్ఫిడెన్స్‌‌. అది ఎప్పుడూ పోగొట్టుకోలేదు.

నాన్న కలను నెరవేర్చా..

మాది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొత్తకొండాపురం. కోదాడలో సెటిలైనం.  నాన్న కొమరబండ హైస్కూల్లో  టీచర్​.  అమ్మ హౌస్​వైఫ్. మా నాన్నకు గ్రూప్​ 2 ఆఫీసర్​ కావాలనే కోరిక ఉండేది. కొద్ది మార్కుల తేడాతో జాబ్​ మిస్ అయ్యారు. ఆయన కలను నేను నెరవేర్చాలని గోల్​గా పెట్టుకున్న.. అదే టార్గెట్​తో చదివిన. సక్సెసయిన. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ జాబ్ రావడం నాకు.. మా నాన్నకు ఆనందం. ఇద్దరం హ్యాపీ.

– మిర్యాలగూడ, వెలుగు

 

Latest Updates