మీర్జాపూర్-2 వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలి

న్యూఢిల్లీ: హిందీలో తెరకెక్కించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌‌కు మంచి పాపులారిటీ ఉంది. ఈ సిరీస్‌‌లోని తొలి సీజన్‌‌ను తెలుగులో డబ్బింగ్‌ చేసి అమెజాన్ ప్రైమ్‌‌లోనే అందుబాటులో ఉంచారు. ఈ సిరీస్ తెలుగు ఆడియన్స్‌‌కు బాగా దగ్గరైంది. ఈ సిరీస్‌‌కు తాజాగా మీర్జాపూర్-2 పేరుతో సీక్వెల్ రిలీజైంది. మీర్జాపూర్ 2పై ఉత్తర్ ప్రదేశ్‌‌లోని మీర్జాపూర్ నియోజకవర్గ ఎంపీ, అప్నాదళ్ పార్టీ నేత అనుప్రియా పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీర్జాపూర్-2 వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలని అనుప్రియ డిమాండ్ చేశారు. మీర్జాపూర్ సిటీని హింసాత్మక ప్రాంతంగా చూపించినందుకు వెబ్ సిరీస్ నిర్మాతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని మోడీ ఆధ్వర్యంలో మీర్జాపూర్ సిటీ సామరస్య కేంద్రంగా ముందుకెళ్తోందన్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌‌ను హింసాత్మకంగా తెరకెక్కించారని, సిటీ ప్రతిష్టకు భంగం కలిగేలా తీశారని మండిపడ్డారు.

Latest Updates