ట్రావెల్స్ బస్సు కు తప్పిన పెను ప్రమాదం

Miss Accident in Kaveri Travels bus

గురువారం ఉదయం బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కు పెను ప్రమాదం  తప్పింది. వనపర్తి జిల్లా విలియంకొండ వద్ద 44 జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఓ లారీని తప్పించబోయే క్రమంలో  అదుపు తప్పి బస్సు బోల్తా పడింది.  ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. ఐదేళ్ల చిన్నారి తోపాటు మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో  40 మంది ప్రయాణికులున్నారు.   ప్రమాదం గురించి వెంటనే 108 కు సమాచారం అందించడంతో..  108 సిబ్బంది సకాలంలో చేరుకొని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. లారీని తప్పించే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ ఫరీద్ తెలిపాడు.

.

Latest Updates