టీకా మిస్సయినా వేయించొచ్చు..!

పిల్లలు భవిష్యత్​లో ఆరోగ్యంగా ఉండేందుకు వేయించే వ్యాక్సినేషన్‌‌ పేరెంటింగ్‌‌​లో ఎదురయ్యే చాలెంజెస్​లో ఒకటి.. ​. అది చాలెంజ్​ ఎందుకంటే, నెలలవారీగా వ్యాక్సిన్​ షెడ్యూల్​ ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకుని ఎలాంటి పరిస్థితుల్లోనైనా వేయించాలి. ఇంతకుముందు ఈ వ్యాక్సినేషన్​ విషయంలో పేరెంట్స్​కి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ కరోనా కాలంలో పిల్లలను హాస్పిటల్స్​కి తీసుకెళ్లడానికి చాలా భయపడుతున్నారు. దాంతో కొంతమంది షెడ్యూల్​ ప్రకారం పిల్లలకు వ్యాక్సిన్​ వేయించట్లేదని చెప్తోంది వరల్డ్​ హెల్త్​ ఆర్గనైజేషన్​.

సాధారణంగా పిల్లలకు పుట్టినప్పట్నించి ఏడాది, రెండేళ్ల వరకు వ్యాక్సినేషన్​ ఉంటుంది. అలాంటిది చాలామంది అమ్మానాన్నలు బయటికి, హాస్పిటళ్లకు వెళ్తే ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయంతో వ్యాక్సిన్​ వేయించడాన్ని మిస్​ చేస్తున్నారు. డబ్ల్యూహెచ్​ఓ సేకరించిన డేటా ప్రకారం సుమారు ఎనిమిది కోట్లమంది పిల్లలకు డిప్తీరియా, మీజిల్స్​, పోలియో రాకుండా వేయించే వ్యాక్సినేషన్​ని మిస్​ చేశారట పేరెంట్స్‌‌. ఈ వ్యాక్సినేషన్​ పిల్లలను వ్యాధుల బారినపడకుండా కాపాడుతాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మిస్​ అయిన టీకాలను త్వరగా వేయించండని డాక్టర్లు చెప్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్​లాక్​ జరుగుతోంది కాబట్టి.. పిల్లలకు మిస్​ అయిన వ్యాక్సినేషన్​ని వేయించొచ్చు. తెలిసిన పీడియాట్రిషియన్​ని సంప్రదించి పిల్లల వయసుని బట్టి టీకాలు వేయించాలి. లేదంటే భవిష్యత్​లో పిల్లలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు పూర్తి బాధ్యత అమ్మానాన్నలదే అవుతుంది. హాస్పిటల్​కి వెళ్లేటప్పుడు పేరెంట్స్​తో పాటు పిల్లలకు కూడా ఫేస్​షీల్డ్​, గ్లోస్‌ వాడాలి. శానిటైజర్​తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. వ్యాక్సినేషన్​ వల్ల పిల్లలకు మామూలుగా వచ్చే జ్వరానికి ముందుగానే సిరప్​ కొనిపెట్టుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ బిడ్డల భవిష్యత్​ని కాపాడుకోవాలి.

Latest Updates