మాయమాటలు చెప్పి బాలుడుని ఎత్తుకెళ్లింది

తిరుపతి రేణిగుంట రైల్వే స్టేషన్ లో 6 నెలల బాలుడు మిస్సయ్యాడు. గుర్తు తెలియని మహిళ బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాడిపత్రికి చెందిన స్వర్ణలత కు  అదే పట్టణానికి చెందిన శివుడు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వారికి పెద్దబాబు అనే 6నెలల కొడుకు ఉన్నాడు. భర్తతో గొడవపడి రేణిగుంటలోని పుట్టింటికి వెళ్లింది స్వర్ణలత. పుట్టింటి వారితో కూడా విభేదాలు రావడంతో.. చండి బిడ్డతో కలిసి వారం రోజులుగా రేణిగుంట స్టేషన్ ఉంటోంది.

ఇదంతా గమనించిన గుర్తి తెలియని మహిళ.. స్వర్ణలతను పరిచయం చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పింది. వారికి కొత్త బట్టలు కొనిచ్చి.. వేసుకుని రమ్మని చెప్పింది. స్వర్ణలత పక్కకు వెళ్లగానే చండి బిడ్డను ఎత్తుకెళ్లింది. బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినా..కేసు నమోదు చేసుకోకుండా రెండు రోజులు తిప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత రేణిగుంట అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో FIR నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా గుర్తు తెలియని మహిళ బాబును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. మహిళ కోసం రెండు పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

 

Latest Updates