సరూర్ నగర్ లో మిస్సింగ్ కేసు నమోదు

రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. చేవూరి విద్యాసాగర్ రావు(53) ఈనెల 10వ తేదీనుంచి కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. కంప్లయింట్ తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. దర్యాప్తుచేస్తున్నారు.

ఓల్డ్ సరూర్ నగర్ లోని బాపూనగర్ లో భార్యా, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు విద్యాసాగర్ రావు. ఆయన భార్య టీచర్ గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లకిందట.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తనకు అవమానం జరిగిందని తీవ్రంగా ఆవేదన చెందాడనీ.. ఆ తర్వాత అప్పుడప్పుడు మతిస్థిమితం తప్పినట్టుగా ప్రవర్తిస్తుంటాడని కుటుంబసభ్యులు చెప్పారు. ఓ పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో కనిపించలేదని… తమ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో లభించిన దృశ్యాలను పరిశీలిస్తే.. కొత్తపేటలో చివరిసారి కనిపించాడని ఆయన కుమారుడు చెప్పారు. రాత్రి, పగలు తేడాలేకుండా.. మూడురోజులుగా ప్రతి గల్లీలోనూ వెతుకుతున్నామని.. ఆయన ఆచూకీ తెలిస్తే 97035 21011 నంబర్ కు గానీ, పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు.

Latest Updates