గ్రేటర్ లో నలుగురు మిస్సింగ్

జీడిమెట్లలో యువతి..

మల్కాజిగిరిలో యువకుడు

నాచారంలో వివాహిత..

నల్లకుంటలో మరొకరు

జీడిమెట్ల/మల్కాజిగిరి, వెలుగు: యువతి మిస్సింగ్ ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్ కి చెందిన చందనకుమారి(20) ఈ నెల 9న ఉదయం 10 గంటలకు గురుమూర్తి నగర్​లో ఉండే  పిన్ని వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పింది. అక్కడికి వెళ్లిన చందనకుమారి అదే రోజు సాయంత్రం అల్​బెస్టర్​ కాలనీలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాని చెప్పి తిరిగి రాలేదు. దీంతో చందనకుమారి తండ్రి కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మల్కాజిగిరిలో..

యువకుడు మిస్సింగ్ ఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సంజీవ్ రెడ్డి కథనం ప్రకారం..మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ లో ఉండే భూపతి అనంత్(26)  మేస్త్రీ పనిచేస్తున్నాడు. భూపతి అనంత్ ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచి టాయ్ లెట్ కోసం బయటికి వెళ్తున్నానని చెప్పాడు. రాత్రయినా అనంత్ ఇంటికి తిరిగి రాలేదు. అతడి తమ్ముడు లోకేశ్​ఫోన్ చేస్తే అనంత్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. లోకేశ్ సోమవారం మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు.

నాచారంలో

వివాహిత మిస్సింగ్ ఘటన నాచారం పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ మహేశ్ కథనం ప్రకారం..రాఘవేంద్రనగర్ లో  ఉండే సయ్యద్ జెబ(20) ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆధార్ కార్డు, 25 తులాల బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయింది. నైట్ డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన జెబ భర్త అమీరుద్దీన్ భార్య ఇంట్లో లేకపోవడంతో బంధువులు, ఫ్రెండ్స్ దగ్గర అడిగాడు. ఎక్కడా భార్య ఆచూకీ దొరక్కపోవడంతో అమీరుద్దీన్ నాచారం పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ​తెలిపారు.

నల్లకుంటలో..

యువతి మిస్సింగ్ ఘటన నల్లకుంట పీఎస్ పరిధిలో జరిగింది.  పోలీసుల కథనం  ప్రకారం.. నల్లకుంట శివం రోడ్డులోని వి.ఎన్ ఆర్ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న డి.శ్రీనివాస్ కు కొడుకు రవితేజ, కూతురు పూర్ణిమ(22)   శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు  భార్య వెంకటలక్ష్మి తో కలిసి జామై ఉస్మానియా లోని చర్చి కి వెళ్లారు. ఆ సమయంలో రవితేజ,పూర్ణిమ ఇంట్లోనే ఉన్నారు. 7 గంటల ప్రాంతంలో చెల్లి పూర్ణిమ కనిపించడం లేదంటూ రవితేజ తండ్రి శ్రీనివాస్ కి ఫోన్ చేసి చెప్పాడు. ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ దంపతులు అపార్ట్ మెంట్ చుట్టుపక్కల వెతికినా పూర్ణిమ ఆచూకీ దొరకలేదు. దీంతో  శ్రీనివాస్ నల్లకుంట పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. మల్కాజిగిరికి చెందిన మెకానిక్ పై అనుమానం ఉన్నట్టు శ్రీనివాస్ కంప్లయింట్ లో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Latest Updates