గ్రేటర్ లో ఐదుగురు మిస్సింగ్

ఖైరతాబాద్,వెలుగు: యువతి మిస్సింగ్ ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సతీశ్ కథనం ప్రకారం..ఒడిశాకు చెందిన పూనం కేమూన్(26) కుటుంబం సిటీకి వచ్చి ఆనంద్ నగర్ కాలనీలో ఉంటోంది.  పూనం ఈ నెల 7న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె చెల్లి నేహా పోలీసులకు కంప్లయింట్ చేసింది.

జవహర్ నగర్ లో..

శామీర్ పేటలోని యాదరాసిపల్లికి చెందిన గ్యారపోచయ్య భార్య రాజేశ్వరి(26), కూతురు అర్చన(8)  బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రాలేదు.  పోచయ్య పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

పాతబస్తీలో

యాకుత్ పురలోని ఈదీబజార్ బస్తీకి చెందిన మహ్మద్ షఫీయుద్దీన్(60) ఈ నెల 7న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు గురువారం భవానీనగర్ పోలీసులకు కంప్లయింట్ చేశారు.

దమ్మాయిగూడలో

యువతి మిస్సింగ్ ఘటన జవహర్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం..కీసర మండలం, దమ్మాయిగూడలోని రాజిరెడ్డి నగర్​లో ఉండే రాంపల్లి మమత (19) సేల్స్ గర్ల్ గా పనిచేస్తోంది. బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లిన మమత తిరిగి రాలేదు. మమత కుటుంబీకులు పోలీసులకు కంప్లయింట్ చేశారు.

 

Latest Updates