వేర్వేరు చోట్ల నలుగురు మిస్సింగ్

మేడిపల్లిలో మతిస్థిమితం లేని యువతి
మల్కాజిగిరిలో వృద్ధుడు
మీర్ పేటలో వివాహిత..
చందానగర్ లో మరోకరు

మేడిపల్లి, వెలుగు: మతిస్థిమితం సరిగా లేని యువతి మిస్సింగ్ ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని బొల్లిగూడెం కాలనీలో ఉండే మహ్మద్ తాజుద్దీన్ కూతురు సీమా బేగం(26)కి మతిస్థిమితం సరిగా ఉండటం లేదు. సీమా బేగం సెప్టెం బర్ 27న
రాత్రి 7 గంటలకు ఇంట్లో నుంచి బయటికెళ్లి తిరిగిరాలేదు. బుధవారం ఆమె తండ్రి మేడిపల్లి పోలీసులకు కంప్లయింట్ చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మల్కాజిగిరిలో

వృద్ధుడు మిస్సింగ్ ఘటన మల్కాజిగిరి పీఎస్ పరిధిలో జరిగింది. సఫిల్ గూడలో ఉండే పీఎస్ సెల్వరాజన్(85) 2015 మార్చి 15న
ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికెళ్లి తిరిగి రాలేదు. రాజన్ భార్య సత్యభామ మల్కాజిగిరి పరిసర ప్రాంతాలన్నీ గాలించినా
అతడి ఆచూకీ తెలియలేదు. నాలుగేళ్లుగా భర్త తిరిగి వస్తాడని సత్యభామ ఎదురు చూసిందని..నేటికీ రాజన్ రాకపోవడంతో బుధవారం మల్కాజిగిరి పీఎస్ లో కంప్లయింట్ చేసినందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్
మన్మోహన్ తెలిపారు.

మీర్ పేటలో

వివాహిత మిస్సిం గ్ ఘటన మీర్ పేట పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. గాయత్రినగర్ కి చెందిన వెంకటేశ్ కూతురు కట్టెల మమత(23)కి
2015లో నందనవనంకి చెందిన నవీన్ తో పెళ్లైంది. 8 నెలల క్రితం నవీన్,మమత మధ్య గొడవలు జరిగాయి. అప్పటి నుంచి మమత
తల్లిదండ్రుల దగ్గరే ఉంటోంది. మంగళవారం రాత్రి మమత ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా బయటికెళ్లి తిరిగిరాలేదు. తండ్రి వెంకటేష్
మీర్ పేట పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాదయ్య తెలిపారు.

చందానగర్ లో

యువతి మిస్సింగ్ ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. చందానగర్ లోని ఇంద్రానగర్ కి చెందిన శనమ్మ కుమార్తె కె.అనురాధ(21)
బాంబే డైయింగ్ షాప్ లో పనిచేస్తోంది. ఈ నెల 26న ఇంట్లోనే ఉన్న అనురాధ సాయంత్రం బయటికెళ్లి తిరిగిరాలేదు. బుధవారం తల్లి శనమ్మ చందానగర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రమేశ్ తెలిపారు.

Latest Updates