శంషాబాద్ లో విమానానికి తప్పిన ప్రమాదం

శంషాబాద్  విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్  నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం రన్ వే పైకి వెళుతుండగా ఇంజిన్ లో సాంకేతికలోపం తలెత్తింది. పైలట్  దీనిని గుర్తించి అప్రమత్తమవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.  2 గంటల తర్వాత వారందరినీ వేరే విమానంలోకి బదిలీ చేశారు. అయితే ఇండిగో సిబ్బంది మాత్రం దీనిని సాధారణమైన సమస్యగా చెబుతున్నారు.

Latest Updates