భగీరథ ఆకాశగంగ

మిషన్ భగీరథ నీరు ఉన్నట్టుండి 200 అడుగుల మేర ఆకాశానికి ఎగిసిపడింది. శనివారం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం బండర్ పల్లి సమీపంలో హైదరాబాద్, రాయిచూర్ అంతర్ రాష్ట్ర రోడ్డు పక్కన జేసీబీతో రోడ్డు రిపేరు చేస్తుండగా పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్థానికులు పైపులైన్‌ లీకేజీని గమనించి అధికారులకు సమాచారమివ్వడంతో నీటి సరఫరాను ఆపివేశారు. అయినా, చాలాసేపటి వరకు వరద కొనసాగింది. అయితే వాటలర్ ఒక్కసారిగా ఎత్తుకు ఎగసిపడటంతో చాలామంది సెల్ఫీలు దిగుతూ ఫొటోలకు పనిచెప్పారు. ఆకాశం నుంచే జలపాతం వచ్చినట్లు ఉందంటు మురిసిపోయారు. వాటర్ ను లీక్ అయ్యిందని తెలుసుకున్న స్థానిక రైతులు తమ భూములకు నీటిని మలుపుకున్నారు. వృధా కాకుండా చేశారు.

Latest Updates