కమీషన్ కోసమే మిషన్ భగీరథ : జీవన్ రెడ్డి 

హైదరాబాద్ : మిషన్ భగీరథ పుట్టిందే కమీషన్ కోసం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్ లో మాట్లాడిన జీవన్ రెడ్డి..పాలన గాడి తప్పిందని కలెక్టర్ ల సదస్సులో సీఎం ఓప్పుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ వాస్తవ పరిస్థితులు గమనిస్తున్నందుకు కృతజ్ఞతలు అన్నారు. సీఎం తన పాలన అవినీతిమయమైందని గుర్తించారని.. అవినీతికి ద్వారాలు తెరవడం మినహా మీరు సాదించింది ఏమిటి.. ఇది నేను చెప్తుంది కాదు కలెక్టర్ ల సదస్సులో సీఎం చెప్పిందేనన్నారు జీవన్ రెడ్డి.

అవినీతిని తగ్గించేందుకు కొత్త రెవెన్యూ పాలసీ అంటున్నారు.. అంటే ఇప్పటివరకు అవినీతి జరిగిందని ఓప్పుకున్నట్లే కదా.. ముందే రెవెన్యూ చట్టాలను సరిచేసి అప్పుడు భూ ప్రక్షాళన చేయాల్సింది…తప్పు జరిగాక ప్రక్షాళన చేస్తామంటుంన్నారు..తన తప్పును అధికారుల మీదకు నెట్టే ప్రయత్నం సీఎం చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ అధికారులను కట్టడి చేయాల్సింది కలెక్టర్ లు కాదా..కలెక్టర్ లను అదుపు చేయాల్సింది సీఎం కాదా అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి.

మెరుగైన పాలనకోసమే కొత్త జిల్లా లు ఏర్పాటు చేసామంటున్నారు…మెరుగైన పాలన ఏది.. అధికారులను వికేంద్రీకరిస్తామని చెప్పి..ఆర్డీవోలకు పూర్తి అధికారులు ఇస్తామంటుంన్నారని తెలిపారు. ఏ శాఖలో అవినీతి లేదో సీఎం చెప్పాలన్నారు. పోలీసు శాఖ , ఇరిగేషన్ ఈ శాఖలలో అవినీతి  లేదా..మరి వీటి సంగతి ఏమిటన్న ఆయన..మిషన్ భగీరథలో కేసీఆర్ వాటా ఎంత ..అసలు మిషన్ భగీరథ పుట్టిందే కమీషన్ కోసం..మీ తప్పును కప్పి పుచ్చుకునేందుకు అధికారులను బలిచేస్తున్నారన్నారు జీవన్ రెడ్డి.

Latest Updates