మరికల్లో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ..కొట్టుకుపోయిన పత్తి మొక్కలు

 మరికల్లో మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ..కొట్టుకుపోయిన పత్తి మొక్కలు

మరికల్, వెలుగు: మరికల్​లో నారాయణపేటకు వెళ్లే దారిలో సోమవారం తెల్లవారుజామున మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీకేజీ కావడంతో పత్తి మొక్కలు కొట్టుకుపోయాయి. ఆదివారం అప్పంపల్లి గ్రామ సమీపంలో లీకేజీని సరి చేశారు.

సోమవారం తెల్లవారుజాము నుంచి నీటి సరఫరాను ప్రారంభించారు. గ్రామానికి చెందిన రైతు చాకలి కొండన్న చేను పక్కనే మరోసారి లీకేజీ కావడంతో, పత్తి మొక్కలు కొట్టుకుపోయాయి. లీకేజీని సరిచేసి నష్టపరిహారం ఇవ్వాలని బాధితుడు కోరాడు.