కరోనా కలవరం.. ఇటలీ చేసిన తప్పులివే..

ఇటలీలో కరోనా వైరస్ జనాన్ని వేటాడుతోంది. ఇప్పటివరకు 2,500 మంది చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొంత, ప్రజలు పట్టించు కోకపోవడం వల్ల కొంత.. దీనితో, జస్ట్​ రెండు వారాల్లో ఇటలీ పరిస్థితి భయంకరంగా తయారైంది . స్టేజ్ 3 నుంచి స్టేజ్ 6కి రావడానికి జస్ట్​ 5 రోజులే పట్టింది.

స్టేజ్ 1

కరోనా కేసులున్నాయని తెలిసి ‘నాకేం అవుతుందిలే. నేనేమైనా ముసలోన్నా నాకు వైరస్ అంటడానికి. నా బతుకు నేను బతుకుతా.

స్టేజ్ 2

రెడ్​జోన్లుగా ప్రకటించినా, క్వారెంటైన్ అవుతున్నా భయపడలే. చనిపోతున్నది ముసలోళ్లే కదాని బయటకు వెళ్లడం మానలేదు. స్నేహితులను కలవడం ఆపింది లేదు.

స్టేజ్ 3

పావు వంతు దేశం బంద్ అయిపోయింది. రెడ్​జోన్లలో ఉన్న పదివేల మంది తప్పించుకున్నారు. కరోనా వైరస్ గురించి సర్కార్ మాట్లాడడమే  తప్ప.. జాగ్రత్తలు తీసుకున్నది లేదు.

స్టేజ్ 4

ప్రభుత్వం హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించింది.హాస్పిటళ్లు నిండిపోయాయి. ట్రీట్ మెంట్ చేసేందుకు డాక్టర్లు, నర్సులు సరిపోలేదు.ఫలితం, మరణాలు పెరిగిపోయాయి.

స్టేజ్ 5

రెడ్​జోన్ నుంచి పారిపోయిన ఆ పది వేల మంది ఇటలీ మొత్తానికి వైరస్ అంటించేశారు. ఎకానమీ నష్టపోవద్దన్న ఉద్దేశంతో కొన్ని షాపులు, బార్లు, రెస్టారెంట్లు , మెడికల్ హాళ్లు..అన్నింటినీ తెరిచి ఉంచారు. అదే అదునుగా ఇష్టమొచ్చినట్టు షాపింగ్ లు, బార్లలో తాగడం చేశారు.

స్టేజ్ 6

రెండ్రోజుల తర్వాత అన్నింటినీ బంద్ పెట్టేసింది. సర్కార్  సర్టిఫికెట్ ఉంటే తప్ప బయటకు వెళ్లనీయలె. వెళితే భారీగా ఫైన్ . కరోనా పాజిటివ్​ ఉన్నోళ్లు తిరిగితే 12 ఏండ్ల వరకు జైలు. భయపడాల్సిన పనిలేదు’ అనుకున్నారు.

Latest Updates