జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్ నిధులు దారి మళ్లాయా?

అప్పులు తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, అద్దెదారులకు లీజ్ కట్టలేక దుకాణం మూసేసిన జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్ ప్రమోటర్లు నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టాలని కూడా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు(ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఓ)ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) ఆదేశించింది. జెట్ బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తనిఖీని చేపట్టి, ప్రాథమిక విచారణ చేపట్టిన తర్వాత, ఎంసీఏ ఈ ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ నుంచి నిధుల దారి మళ్లింపుపై మంత్రిత్వ శాఖ ఆధారాలను సేకరించిందని ఎంసీఏ వర్గాలు తెలిపాయి.

సరియైన కారణాలు లేకుండా.. పలు సబ్సిడరీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైటాఫ్  చేసినట్టు తెలిపాయి. కంపెనీ ఫైనాన్సియల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  విచారణ జరపాలని కూడా ఎంసీఏ అనుకుంటోంది. కొన్నేళ్ల నుంచి లాభాలు పండించిన కంపెనీ ఎందుకు 2018 ఆర్థిక సంవత్సరంలో హఠాత్తుగా నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఇదే సమయంలో ఎతిహాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రెండు సార్లు పెట్టుబడులు కూడా వచ్చాయి. అయినా కంపెనీ నష్టాలను నమోదు చేయడమేమిటి? అనే విషయాలపై విచారణ జరపాలని భావిస్తోంది. జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణకు, తనిఖీలకు ఎంసీఏ వెస్ట్రన్ రీజనల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకత్వం వహించనున్నారు.

మరోవైపు అప్పులు కట్టకపోవడంతో, జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్తులను అమ్మి తమకు రావాల్సిన బకాయిలను వసూలు చేసుకుంటోంది హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ. ముంబైలోని ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన బీకేసీ ఆఫీసును హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ అమ్మకానికి పెట్టింది. 52,775 చదరపు అడుగల విస్తీర్ణం గల ఈ ఆఫీసు రిజర్వు ప్రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.245 కోట్లుగా నిర్ణయించింది.

ముంబై సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అర్బన్ ఫైనాన్సియల్ సెంటర్ బంద్ర కుర్లా కాంప్లెక్స్(బీకేసీ)లో నాలుగో అంతస్తులో జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్ గోద్రెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిర్లా కుంద్రా కాంప్లెక్స్​ (బీకేసీ) బిల్డింగ్​లో ఈ ఆఫీసు ఉంది. మే 15న దీని ఈఆక్షన్ జరుగనుంది. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీకు చెల్లించాల్సిన రూ.415 కోట్లను బకాయి పడటంతో, ఈ సేల్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేపట్టింది. ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు, ఆర్థిక సంస్థలకు రూ.8,500 కోట్లు

గోయల్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేదు…

అయితే జెట్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్‌‌‌‌‌‌‌‌ గోయల్‌‌‌‌‌‌‌‌తో కానీ, లేదా గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్లతో కానీ తమకు సంబంధం లేదని విశ్వనాథన్ స్పష్టం చేశారు. అంతకుముందు జాన్సన్ అన్‌‌‌‌‌‌‌‌స్వార్త్‌‌‌‌‌‌‌‌ అనే బ్రిటిష్ వ్యాపారవేత్త కూడా ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి చూపారు. అడి పార్టనర్స్‌‌‌‌‌‌‌‌ కూడా తమ కన్సార్టియంలో భాగమని అన్‌‌‌‌‌‌‌‌స్వార్త్  చెప్పారు. అడి పార్టనర్స్‌‌‌‌‌‌‌‌కు గోయల్‌‌‌‌‌‌‌‌తో సంబంధం ఉన్నట్టు రిపోర్టులు చెప్పాయి. కానీ వారితో తమకు సంబంధం లేదని విశ్వనాథన్ తేల్చి చెప్పారు. ‘మాకు సొంతంగా బలమైన ఇన్వెస్టర్లున్నారు. గోయల్‌‌‌‌‌‌‌‌తో కానీ, అన్‌‌‌‌‌‌‌‌స్వార్త్‌‌‌‌‌‌‌‌తో కానీ సంబంధాలు లేవు. వారితో మేము కలువం. వారెవరో కూడా తెలియదు.  ఇదే విషయాన్ని మేము ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ అధికారులకు కూడా స్పష్టం చేశాం’ అని అడిగ్రూప్‌‌‌‌‌‌‌‌ చైర్మన్, ఎండీ చెప్పారు. ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ అధికారులే ఈ బిడ్డింగ్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ను చూస్తున్నారు.

ఇప్పటికే జెట్‌‌‌‌‌‌‌‌లో ఎతిహాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్టనర్స్, నేషనల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాక్ట్చ్రర్ ఫండ్‌‌‌‌‌‌‌‌లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ కంపెనీలు తుది బిడ్స్‌‌‌‌‌‌‌‌ను దాఖలు చేయాల్సి ఉంది. ‘ఎతిహాద్‌‌‌‌‌‌‌‌తో పనిచేయడానికి మేము ఆసక్తిగా ఉన్నాం. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌కు ఇదే కీలక పార్టనర్. ఒకవేళ జెట్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేయాలని ఎతిహాద్ భావిస్తే, మేము వారితో పనిచేసేందుకు రెడీ’ అని విశ్వనాథన్ చెప్పారు.

అబుదాబికి చెందిన ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సీనియర్ అధికారులతో విశ్వనాథన్ సమావేశం కూడా అయ్యారు. జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్ మాజీ సీఈవో క్రామర్ బాల్‌‌‌‌‌‌‌‌ను కూడా ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. క్రమర్ అత్యధిక ప్రభావమున్న నాయకుడని, జెట్‌‌‌‌‌‌‌‌లో ఆయనతో కలిసి పనిచేసేందుకు మేము చాలా ఇష్టపడుతున్నాం’ అని విశ్వనాథన్ తెలిపారు. జెట్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌ను హాస్పిటాలిటీ, బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షీటు బిజినెస్‌‌‌‌‌‌‌‌గా రన్‌‌‌‌‌‌‌‌ చేయాలని విశ్వనాథన్ భావిస్తున్నారు.

Latest Updates