టీ-20లకి మిథాలీ గుడ్ బై

ఉమెన్స్ క్రికెట్ కు ప్రాణం పోసిన భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీ- 20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం అనౌన్స్ చేశారు. ఉమెన్స్ క్రికెట్ ప్రారంభం నుంచి రాణించిన మిథాలీకి..వరల్డ్ ఉమెన్స్ క్రికెట్ లోనే ఎక్కువ రన్స్ చేసిన రికార్డు ఉంది. భారత్ తరుఫున సత్తాచాటిన మిథాలీ రాజ్..మొత్తం 32 టీ-20 మ్యాచ్ లు ఆడగా..అందులో 3 వరల్డ్ కప్ లకు ఆడింది. కెప్టెన్ గా, ప్లేయర్ గా రాణించిన మిథాలీ..ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాందించింది. ప్రస్తుతం వన్డేలు, టెస్టు మ్యాచుల్లో తన ఆటను కొనసాగిస్తానని చెప్పింది.

Latest Updates