నేనా.. రిటైర్‌ మెంటా!

ముంబై: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగే టీ20ల తర్వాత తాను పొట్టి ఫార్మాట్‌ నుంచి రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్నట్టు వస్తున్న వార్తలను టీమిండియా వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ కొట్టిపారేసింది. టీ20ల నుంచి రిటైరయ్యే ఆలోచన తనకు లేదని, ఇంకా ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌‌‌‌ విమెన్స్‌ టీమ్‌ తో జరిగే వన్డే సిరీస్‌ లో విజయం సాధిస్తామని మిథాలీ ధీమాగా చెప్పింది. 2021 వరల్డ్‌ కప్‌ కు డైరెక్ట్ గా అర్హత సాధించేందుకు కృషి చేస్తు న్నామని మిథాలీ తెలిపింది.

Latest Updates