అధికారుల నిర్లక్ష్యం.. వర్షం లేకున్నా నీట మునిగిన కాలనీ

రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథిలా నగర్ కాలనీ వర్షం లేకున్నా నీట మునిగింది. ఎలాంటి వ‌ర్షం, వ‌ర‌ద లేకుండా కాల‌నీ మొత్తం ఒక్క‌సారిగా నీటితో నిండిపోవ‌డంతో కాలనీ వాసులు బ‌య‌ట‌కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ట్రంకు లైన్ పేరుతో ప్రభుత్వం గత సంవత్సరంలో ప్రారంభించిన పనులు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం మంత్రాల చెరువులో వర్షం నీళ్లు నిండుగా చేరాయి. చెరువు పై భాగంలో ఉన్న ఎం.ఎల్. ఆర్ కాలనీ లోకి బ్యాక్ వాటర్ వస్తుండ‌డంతో అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తూము గేట్లు తెరిచారు. దీంతో చెరువు కింది భాగంలో ఉన్న మిథిలా నగర్ కాలనీకి ఆ నీళ్లు చేరాయి. ఇళ్లలోకి నీళ్లు రావ‌డంతో కాలనీవాసులు లబోదిబోమంటున్నారు. అధికారులు పట్టించుకోవాల‌ని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

mithila nagar colony was submerged when the pond sluice was opened by the authorities negligently

Latest Updates