న్యూస్ పేపర్ వేస్తానంటూ.. తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు

తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని, చోరీలకు పాల్పడుతున్న పేరు మోసిన దొంగను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లపు వెంకటేష్ అనే దొంగ..  డైలీ న్యూస్ పేపర్ వేస్తామంటూ, రెక్కీ నిర్వహించి నగరంలోని పలు ఇళ్లలో చోరీలకి పాల్పడ్డాడని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ దొంగను అరెస్ట్ చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధుల్లో 51 కేసులలో వెంకటేష్ నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. నిందితుడి నుండి లక్షా పదిహేడు వేల రూపాయల నగదు, 41 తులాల బంగారు ఆభరణాలు, రెండు పల్సర్ బైకులు స్వాధీనం చేసుకున్నామన్నారు డీసీపీ. వెంకటేష్ ని గతంలోనే ఎల్.బీ.నగర్ పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కీ తరలించారు. జైలు నుండి విడుదలైన వెంకటేష్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీలు చేసేవాడని డీసీపీ వెంకటేశ్వరరావు  పేర్కొన్నారు. వెంకటేష్ పై మాదాపూర్ పోలీసులు గతంలో పీడీ యాక్ట్ నమోదు చేసినా, మార్పు రాలేదని ఆయన అన్నారు.

Latest Updates