ఈ బుడ్డోడు ఇపుడు ‘పెటా’ బ్రాండ్ అంబాసిడర్

డెరిక్ సి లాల్ చన్హిమా అందరికీ గుర్తుండే ఉంటాడు. మిజోరం రాష్ట్రానికి చెందిన క్యూట్ కిడ్. కోడిపిల్లపైనుంచి తాను సైకిల్ పోనిచ్చాననే బాధతో.. దానిని బతికించుకునేందుకు ఎంతో తపన పడి… ప్రపంచం దృష్టి ఆకర్షించాడు ఈ బాలుడు. అది చనిపోయినా కూడా… అతడి అమాయకత్వం… మూగజీవాలపై ఈ కిడ్ చూపించిన ప్రేమ అందరి ప్రశంసలు అందుకుంది.

డెరిక్ చేసిన మంచి పని… ప్రాంతాలు, దేశాలతో సంబంధం లేకుండా ప్రపంచమంతా వైరల్ అయింది. అతడికి సాహస బాలుడు అవార్డ్ ఇచ్చి గౌరవించింది స్కూల్. అంతేకాదు.. ఇపుడు మరో గుర్తింపు , గౌరవం దక్కించుకున్నాడు డెరిక్. మూగజీవాలు, జంతు హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న పెటా ఇండియా సంస్థ తాజాగా… డెరిక్ కు ‘కంపాషనేట్ కిడ్’ అనే అవార్డ్ ఇచ్చింది. బుడ్డోడు చూపించిన కారుణ్యానికి మెచ్చి ఈ అరుదైన గుర్తింపు ఇచ్చింది పెటా.

Latest Updates