తన పదవికి రాజీనామా చేసిన మిజోరం గవర్నర్

mizoram governor kummanam rajasekharan Resigned

mizoram governor kummanam rajasekharan Resignedమిజోరం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజశేఖరన్ రాజీనామాను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించారు. కేరళ బీజేపీ మాజీ అధ్యక్షుడైన రాజశేఖరన్ 2018 మేలో మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గవర్నర్ పదవికి రాజశేఖరన్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు సమాచారం. తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజశేఖరన్ రాజీనామాపై శశిథరూర్ స్పందించారు. రాజశేఖరన్ తో వ్యక్తిగత వైరం లేదన్నారు. తన కొడుకు వివాహ రిసెప్షన్ కు కూడా రాజశేఖరన్ హాజరైన విషయం గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాల మధ్యే పోటీ ఉంటుందన్నారు.

Latest Updates