MLA హత్య : అరకు, దుంబ్రిగూడ పీఎస్ లకు నిప్పు

అరకు MLA కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యపై స్థానిక గిరిజనులు, హత్యకు గురైన ప్రజాప్రతినిధుల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమంటూ డుంబ్రిగూడ, అరకు పోలీస్ స్టేషన్‌ ల పై దాడికి దిగారు. రెండు పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టి తగలబెట్టారు. ఈ ఘటనలో అరకు పోలీస్‌ స్టేషన్ పూర్తిగా దగ్ధమైంది. ఈ దాడిలో పలువురు పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అరకు, డుంబ్రిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
మూడు రోజులుగా మావోయిస్టు వారోత్సవాలు జరుగుతుంటే.. పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని గ్రామస్ధులు ఆరోపిస్తున్నారు. నేతలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పలేదని.. కనీసం భద్రతను కూడా పెంచలేదంటున్నారు.

Posted in Uncategorized

Latest Updates