ఈ 17న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ ప్రారంభం

mla-and-mlcs-quarters-opening-on-this-17th

హైదరాబాద్ హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన MLA,MLCల నివాస గృహ సముదాయాలను ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నారు. ఆ రోజున ఏరువాక పౌర్ణమి కావడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్‌ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్వార్టర్స్‌ ను స్పీకర్‌ శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ ఓపెనింగ్  చేయనున్నారు

మొత్తం 4.5 ఎకరాల్లో రూ. 166 కోట్లతో 12 అంతస్తులతో 120 క్వార్టర్లను నిర్మించారు. 2100 చదరపు అడుగుల ప్రతి క్వార్టర్‌లో 3 బెడ్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఏరియాలోనే బ్యాంకు, క్లబ్‌ హౌజ్‌, సూపర్‌ మార్కెట్‌ నిర్మించారు.

Latest Updates