CAA: పాకిస్తాన్ నుంచి వచ్చినా ఇక్కడ ఉండొచ్చన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

సీఏఏకు టీఆర్ఎస్ వ్యతిరేకం.. పాకిస్తాన్ నుంచి వచ్చినా ఇక్కడ ఉండొచ్చు
అసదుద్దీన్ ఓవైసీ తో కలిసి బహిరంగ సభ నిర్వహిస్తాం
బీజేపీ నాయకులపై తిరగబడండి: ఎమ్మల్యే అరికెపూడి గాంధీ

CAA పై శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలోనే కాదు, పాకిస్థాన్ నుంచి వచ్చినా కూడా ఇక్కడి నుంచి పంపించే వారెవరూ లేరని అన్నారు. ఒకవేళ అలా పంపాల్సి వస్తే… తాను కూడా మీతో వస్తానని చెప్పారు. శేరిలింగంపల్లిలో తనను కలిసిన మైనార్టీలతో ఈ కామెంట్స్ చేశారు గాంధీ. బీజేపీ నేతలు మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని అక్కడ సీఏఏ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. కల్లబొల్లి మాటలతో మీ మధ్యకు వచ్చే బీజేపీ నాయకులపై తిరగబడాలని అన్నారు. అవసరం ఐతే అసదుద్దీన్ ఓవైసీ తో కలిసి బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణలో CAA అమలు కాదన్నారు అరికెపూడి గాంధీ.

Latest Updates