ఈ ఎన్నికల మేనిఫేస్టో ప్రజారంజకమైంది

హైదరాబాద్: సీఎం కేసీఆర్ విడుదల చేసిన టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫేస్టో ప్రజారంజకంగా ఉందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9 లోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు డివిజన్ అభ్యర్థి కాజా సూర్యనారాయణతో కలిసి  పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దానం.. నాయి బ్రాహ్మణులకు , రజకులకు ఉచిత విద్యుత్ ఇస్తామనడం పేద వర్గాల పట్ల సీఎంకు చిత్త శుద్ధికి నిదర్శనమన్నారు. 25వేల లీటర్ల లోపు నీటిని వినియోగించే వారికి బిల్లులు రద్దు చేయడం గొప్ప నిర్ణయమన్నారు.

ఇది బడుగుబలహీన వర్గాల మ్యానిపేస్టో అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్‌ కృషి చేస్తోందన్న దానం… సినీ పరిశ్రమ బలోపేతం కోసం కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీ పాలన చేయడంలేదన్న ఆయన.. నగర అభివృద్ధినే తమ లక్ష్యంగా ముందుకుసాగుతామన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని..  గతంలో ఆదరించినట్లుగానే ఈసారి కూడా తనను ఆదిరించి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

 

Latest Updates