మహాగణపతికి మొక్కులు చెల్లించుకున్న దానం నాగేందర్…

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. 70 అడుగుల వెండి హారాన్ని స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. ముందుగా గవర్నర్ దంపతులతో పాటు, దానం నాగేందర్ దంపతులు కూడా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.  సాయంత్రం లోగా వాటర్, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

Latest Updates