మొదటి సారి మంత్రిగా గంగుల కమలాకర్ ప్రమాణం

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మొదటి సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళ సై  గంగుల చేత ప్రమాణం చేయించారు.  2000లో కౌన్సిలర్ గా గెలిచిన గంగుల..2005 నుంచి 2009 వరకు కార్పొరేటర్ గా పని చేశారు. 2009 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు గంగుల. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2018లోనూ టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన గంగుల బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పై విజయం సాధించారు. కరీంనగర్ లో కేసీఆర్ కు దగ్గరి అనుచరిడిగా పేరొందిన గంగుల మంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Latest Updates