కారు గెలిస్తే మళ్ళీ కాలర్ ఎగరేస్తడు.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళీ గెలిస్తే రాష్ట్ర ప్రజలకు శాపం కానుంద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకున్నా కారు గెలిస్తే మళ్ళీ కేసీఆర్ కాలర్ ఎగరేస్తడని, హామీలు అమలు చేయకున్నా దుబ్బాక ప్రజలు గెలిపించారంటాడ‌ని ఆయ‌న అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్ ఎండగట్టినా ప్రజలు పట్టించుకోతే తెలంగాణను ఎవరూ కాపాడలేరని అన్నారు.

దుబ్బాక ఎన్నిక‌ల విష‌యంలో నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని, దుబ్బాక లో టీఆరెస్ గెలిస్తే- మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీఎం పీఠం ఇచ్చినట్లేన‌ని అన్నారు.ఈ ఎన్నిక‌ల్లో గెలిస్తే ఇచ్చిన ఈ హామీలు రాష్ట్రంలో అమలు చేయడని అన్నారు.

దుబ్బాక లో టీఆర్ఎస్ కు పోలీసులు ప్ర‌చారం చేస్తున్నార‌ని, అందుకు కలెక్టర్ సపోర్ట్ చేస్తున్నారన్నారు. ఎన్నికల పోలింగ్, ఫలితాలు రాకముందే టీఆర్ఎస్ గెలిచినట్లు ప్రకటన చేస్తున్నార‌న్నారు.గెలుపు ఖాయమ‌ని, మెజారిటీ మాత్రమే అని మంత్రి హరీష్ రావు దొంగమాటలు చెబుతున్నాడ‌ని అన్నారు. దుబ్బాక లో ఓడిపోతే హరీష్ రావుకు మంత్రి పదవి ఉండదు, వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట టిక్కెట్టు ఉండదన్నారు. దుబ్బాక ఉపఎన్నిక హరీష్ రావు రాజకీయ జీవితానికి ముడిపడి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ దుబ్బాక లో ఉన్న కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి టీఆర్ఎస్ ను ఓడించమని చెప్పాల‌ని కోరారు.

Latest Updates