నాగిరెడ్డి కమిషనరా..TRS కార్యకర్తా: జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన TRS పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలపై ఓటరు లిస్టు విడుదల కాకముందే టీఆర్ఎస్ నాయకుల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నాగిరెడ్డి TRS కార్యకర్తనా… లేక ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారా అంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఎన్నికల షెడ్యుల్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

TRS ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌తో పాటు పోలీసులను అడ్డుపెట్టుకుని మున్సిపాలిటీల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు  జగ్గారెడ్డి. ప్రజలంతా సంక్రాంతి పండగా జరుపుకునేందుకు రెడీ అవుతుంటే …ఎన్నికల షెడ్యుల్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు కనీసం పండగలను కూడ జరుపుకోకుండా హడావుడిగా షెడ్యుల్ విడుదల చేశారన్నారు.

ఓటర్ల జాబితా విడుదల చేయకపోవడంతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియ కూడ ఇంకా పూర్తి కాలేదని, అయినా షెడ్యుల్ విడుదల చేశారని ఆయన ఆరోపించారు. షెడ్యుల్‌పై అనేక అనుమానాలు ఉన్నాయన్న జగ్గారెడ్డి… సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని కోరామన్నారు.

Latest Updates