ఎన్ కౌంటర్లతో అత్యాచారాలు ఆగిపోతాయా: జగ్గారెడ్డి

నిందితుల పట్ల సానుభూతిలేదు, వెనకేసుకు రావడం లేదు
ఎన్ కౌంటర్ ఎమోషనల్ గా మాట్లాడే అంశం కాదు

ఎన్ కౌంటర్లతో అత్యాచారాలు ఆగిపోతాయా
చట్టం, పోలీస్ తనపని తాను చేయాలి: జగ్గారెడ్డి

‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ ఎమోషనల్ గా మాట్లాడే అంశం కాదని అన్నారు కాంగ్రెస్ లీడర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అత్యాచారం చేసిన వాళ్లను వెనకేసుకు రావడంలేదని అయితే… చట్టం, పోలీస్ తనపని తాను చేయాలని ఒకరి పనిని మరొకరు చేయకూడదని అన్నారు. ఎన్ కౌంటర్ తో సమస్య పరిష్కారం అయితే ఇబ్బంది లేదని.. కానీ అప్పటి సీఎం,దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో కూడా ఎన్ కౌంటర్ జరిగిందని …. ఆతర్వాత అత్యాచారాలు ఆగిపోయాయా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. ఎన్ కౌంటర్ పై అనుమానాలు ఉన్నాయని.. అయితే తమ పార్టీ హైకమాండ్ స్పందించాక తాను మాట్లాడతానని చెప్పారు. ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తానని ఆయన అన్నారు.

Latest Updates