మా ప్రభుత్వం వచ్చాక వాళ్లిద్ద‌ర్నీ విడిచిపెట్టం

రాష్ట్రంలోని ప్రాజెక్టులన్ని మేఘా కృష్ణారెడ్డి డిజైన్ చేస్తాడ‌ని.., కాళేశ్వరనికి, భగీరథకు…అసలు అన్ని ప్రాజెక్టులకు మేఘా కృష్ణారెడ్డి అని పేరు పెట్టాల‌ని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి. గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగు, త్రాగు నీరు ఎలా ఇవ్వాలనే ఆలోచిస్తే… విభజన తర్వాత సీఎం అయిన కేసీఆర్ మాత్రం రైతులు,ప్రజల క్షేమం కంటే తన జేబులు నింపుకోవడమే ముఖ్యమనుకున్నారని అన్నారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం మాత్రమే కాదు అతనే ఇంజినీర్ ,కాంట్రాక్టర్ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కి బినామీ మేఘా కృష్ణారెడ్డి అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం లో మేఘా కృష్ణారెడ్డి మారుతి కారు లో తిరుగుతుండే వాడ‌ని, ఇప్పుడు సొంత ఫ్లైట్ లో తిరుగుతున్నాడని అన్నారు. ప్రాజెక్టుల డిజైన్‌తో పాటు ఏ కాలువలో, ఏ పైప్ లైన్ లో ఎంత కొట్టొయ్యెచ్చు అనేది మేఘా కృష్ణారెడ్డి డిజైన్ చేస్తాడని అన్నారు. భారత దేశంలో అంబానీ, ఆధాని గ్రూప్ లో కృష్ణారెడ్డి ఒకడైతాడని అన్నారు.

రిటైర్డ్ ఇంజినీర్ మురళీధర్ రావు ఒక చెంచా అని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మురళీధర్ రావు ,మేఘా కృష్ణారెడ్డిని విడిచిపెట్టమని అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ రావడం ఖాయమని అన్నారు.

Latest Updates